schedule Monday, July 06, 2026

'దర్శిని' ప్రభావం..!

calendar_today July 5, 2023
person dharshininews
'దర్శిని' ప్రభావం..!
'దర్శిని' ప్రభావం..! - రోడ్డుపై మట్టి కుప్పలు తొలగింపు - ఎమ్మెల్యే చొరవతో సమస్య పరిష్కారం - కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు తాండూరు, దర్శిని ప్రతినిధి: జారుతారు జాగ్రత్త.. అనే దర్శిని న్యూస్ కథనానికి వెంటనే స్పందన లభించింది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక చొరవతో పరిష్కారం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని బీసీ స్మశాన వాటిక నుంచి సాయిపూర్ వెళ్లే మార్గంలో ఇటీవలే సీసీ రోడ్డు పనులు చేపట్టారు. ఈ క్రమంలో రోడ్డును క్యూరింగ్ చేసేందుకు రోడ్డుపై మట్టి పోశారు. పని ముగిసిన తరువాత వాటిని తొలగించలేదు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో రోడ్డుపై ఉన్న మట్టి రోడ్డంతా పరుచుకుంది. బుధవారం ఉదయం వివిధ పనుల కోసం రాకపోకలు సాగించిన వాహనదారులు, పాదాచారులు మట్టితో ఇబ్బందులు పడ్డారు. వాహనాలు, ప్రజలు మట్టి వల్ల జారిపడేలా పరిస్థితి తయారైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ మార్గంలోనే ఉన్నాయి. ఉదయం వేళ ఈ మార్గంలో వెళ్లేందుకు విద్యార్థులు, ఆటో డ్రైవర్లు బెంబేలెత్తిపోయారు. ఈ సమస్యపై దర్శిని న్యూస్‌లో కథనం వచ్చింది. ఈవిషయం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి దృష్టికి వెళ్లడంతో సమస్య పరిష్కారానికి ఆదేశించారు. ప్రత్యేకంగా ట్రాక్టర్‌ యంత్రంతో సీసీ రోడ్డుపై ఉన్న మట్టి కుప్పలను తొలగించారు. రోడ్డుపై మట్టీ, నీరు లేకుండా శుభ్రం చేశారు. దీంతో రోడ్డు శుభ్రంగా మారింది. సమస్యను వెంటనే పరిష్కరించడం పట్ల స్థానికులు, పాదాచారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18331 chaithany collage