schedule Monday, July 06, 2026

శివాజీ ఫ్యాన్‌ ఇక్కడ..!

calendar_today July 5, 2023
person dharshininews
శివాజీ ఫ్యాన్‌ ఇక్కడ..!
శివాజీ ఫ్యాన్‌ ఇక్కడ..! - ఇంటి ముందే భారీ విగ్రహం - కారణం తెలిస్తే సెల్యూట్ చేయడం ఖాయం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: మహనీయుల విగ్రహాలను మనం పట్టణాల్లోని ప్రధాన రహదారుల వెంబడి చూస్తుంటాం. ఇంకా చౌరస్తాలలో చూస్తుంటాం. ఓ వ్యక్తి వీర శివాజీపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. పైగా అతను ఓ కానిస్టేబుల్ కూడా. శివాజీపై మరి అంతలా అభిమానం ఎందుకు పెంచుకున్నాడో తెలిస్తే సెల్యూట్ చేయక తప్పదు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పాత గుండ్లపల్లికి చెందిన తాళ్ల శ్రీనివాస్‌రెడ్డికి చిన్నప్పటి నుంచి చత్రపతి శివాజీ అంటే చాలా ఇష్టం. అభిమానం ఉండేది. శ్రీనివాస్ రెడ్డి ఏ పని చేసినా చత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకుని చేస్తుంటాడు. శివాజీ స్ఫూర్తితో శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాడు. డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత దేశభక్తి, సేవా తత్వం బాగా పెరిగింది. ఇటీవల పాత గుండ్లపల్లిలో నూతనంగా ఇంటిని నిర్మించుకున్నాడు. ఇంటి ముందు చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విగ్రహం ఏర్పాటు కోసం అతడు మూడు లక్షల రూపాయలతో 10 అడుగుల ఎత్తులో పూర్తి ఫైబర్‌తో అశ్వంపై ఉన్న వీర శివాజీ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాడు. ఓటమి ఎరుగని వీరుడు, ప్రజల కోసమే పని చేసిన ప్రభువు, దేశభక్తి, జాతీయ అభిమానం చాటి, మహిళా రక్షకుడిగా దేశ చరిత్రలో కీర్తికెక్కిన రాజు శివాజీ అని శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. ఉదయం ఇంటి నుంచి బయటకు రాగానే శివాజీ విగ్రహన్ని చూసి స్ఫూర్తి పొందేందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పాడు. ఈ విషయం తెలిసిన శివాజీ అభిమానులు శ్రీనివాస్ రెడ్డికి సెల్యూట్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18346 chaithany collage