schedule Saturday, July 04, 2026

నేడే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

calendar_today July 7, 2023
person dharshininews
నేడే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
నేడే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు - ప్రకటించిన ఇంటర్ బోర్డు - ఫలితాలు ఎక్కడ చెక్‌ చేసుకోవాలంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్‌ అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫస్ట్‌ ఇయర్‌తో పాటు, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు అధికారులు తెలిపారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు ఇంటర్‌ బోర్డ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లీ పరీక్షలను జూన్‌ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన విషయం విధితమే. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 933 పరీక్షాకేంద్రాల్లో సప్లీమెంటరీ పరీక్షలను నిర్వహించారు. ఫస్ట్ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌లో కలిపి మొత్తం 4,12,325 మంది పరీక్షకు హాజరయ్యారు. అలాగే ప్రాక్టికల్స్‌ను జూన్‌ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18350 chaithany collage