schedule Monday, July 06, 2026

తాండూరు సుభిక్షంతో విరాజిల్లాలి

calendar_today July 8, 2023
person dharshininews
తాండూరు సుభిక్షంతో విరాజిల్లాలి
తాండూరు సుభిక్షంతో విరాజిల్లాలి - బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ - బొడ్రాయి ప్రతిష్టాపనలో పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుభీక్షంతో విరాజిల్లాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ ఆకాంక్షించారు. గత రెండు రోజులుగా తాండూరు పట్టణంలో బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు జరుగుతున్నాయి. శనివారం పట్టణంలోని భద్రేశ్వర దేవాలయ సమీపంలో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలలో బీసీ కమీషన్‌ మెంబర్ శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు. నిర్వాహకులు నారాయణ సార్, భాస్కర్, రవి, నర్సింహ, వెంకట్, వీరన్న ఘనంగా స్వాగతించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. పూజల అనంతరం శుభప్రద్ పటేల్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల దేవతల ఆశీస్సులతో తాండూర్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. దేవుడి ఆశీర్వాదంతో సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సంమృద్ధిగా పండి ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శుభప్రద్ పటేల్ యువసేన సభ్యులు భానుప్రసాద్, విజయ్, కుర్వ బాలు, సచిన్, శ్రీశైలం, నరేష్ గౌడ్, ప్రశాంత్ విజయ్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18395 chaithany collage