schedule Monday, July 06, 2026

ప్రభుత్వ ప్లాట్లను సొంతం చేసుకోండి..!

calendar_today July 10, 2023
person dharshininews
ప్రభుత్వ ప్లాట్లను సొంతం చేసుకోండి..!
ప్రభుత్వ ప్లాట్లను సొంతం చేసుకోండి..! - నేడు వికారాబాద్, తాండూరు మండలాల్లో బహిరంగ వేలం - ఒక్క ఎకరాకు ధర ఎంత ఉంటుందంటే..? వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు, వికారాబాద్ ప్రజలకు అధికారులు మంచి అవకాశం కల్పించారు. రాజీవ్‌ స్వగృహ కింద ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసిన ప్లాట్లకు బహిరంగ వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని వికారాబాద్‌ మండలం అల్లంపల్లి, తాండూరు మండలంలోని అల్లాపూర్ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూముల ప్లాట్లకు ఈ వేలం వేస్తున్నట్లు వెల్లడించారు. అల్లంపల్లిలోని 15 ఎకరాల భూమిలో 22 ఓపెన్‌ ప్లాట్లు నిర్మించడం జరిగిందని తెలిపారు. 0.50 ఎకరాలలో ఒక్కో ప్లాట్ ఉంటుందని, ఒక్కో ప్లాటుకు రూ. 60 లక్షల ధర నిర్ణయించినట్లు తెలిపారు. వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో వేలం జరుగుతుందన్నారు. అదేవిధంగా తాండూరు మండలం అల్లాపూర్ గ్రామం పరిధిలోని సర్వేనెంబర్ 109లో ప్రభుత్వ భూమిలో 27 ఓపెన్ ప్లాట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో 0.50 ఎకరాలతో పాటు 1 ఎకరాలలో మొత్తం 27 ప్లాట్లకు వేలం వేయడం జరుగుతుందన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో బహిరంగ వేలం జరుగుతుందన్నారు. 1 ఎకరాకు రూ. 10 లక్షల ధర నిర్ణయిచండం జరిగిందన్నారు. ఆసక్తిగల వారు బహిరంగ వేలంలో పాల్గొని ఓపెన్ ప్లాట్లను సొంతం చేసుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18442 chaithany collage