schedule Monday, July 06, 2026

శ్రీశైల క్షేత్రాన్ని మురిపించిన సద్గురు మండలి

calendar_today July 12, 2023
person dharshininews
శ్రీశైల క్షేత్రాన్ని మురిపించిన సద్గురు మండలి
శ్రీశైల క్షేత్రాన్ని మురిపించిన సద్గురు మండలి - మల్లికార్జుని సన్నిధిలో భజన కీర్తనల ఆలాపన - సన్మానించి.. ప్రశంస పత్రాలు అందించిన ప్రతినిధులు తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీశైల శైవ క్షేత్రాన్ని వికారాబాద్ జిల్లాకు చెందిన శ్రీ సద్గురు భజన మండలి భక్తి పారవశ్యంలో ముంచెత్తి మురిపించింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీశైల మల్లికార్జున స్వామి సన్నిధిలో నిర్వహించిన ధర్మపథం కార్యక్రమంలో వికారాబాద్ జిల్లాకు చెందిన సద్గురు భజన మండలి పాల్గొంది. 20 మంది సభ్యులతో కూడిన భజన బృందం భజన కీర్తనలు ఆలపించారు. బృందం సభ్యులు ఆలాపించిన భజన కీర్తనలు భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు. అంతేకాకుండా ప్రశంస పత్రాలను అందజేసి న్మానించారు. ఈ సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి సన్నిధిలో భజన కీర్తనలు ఆలాపించే భాగ్యం కల్పించడంపై దేవాలయ కమిటీ సభ్యులకు సద్గురు భజన మండలి సభ్యులు సర్వోత్తం స్వామి, బాల్ రాజ్, శ్రీనివాస్, నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18473 chaithany collage