schedule Monday, July 06, 2026

తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి

calendar_today July 12, 2023
person dharshininews
తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి
తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి - మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ - ఎమ్మెల్సీ సహాకారంతో బోరు తాండూరు, దర్శిని ప్రతినిధి: వార్డుల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణం వార్డు నెంబర్ 27లోని ఓల్డ్ వెజిటెబుల్ మార్కెట్‌లో ఎమ్మెల్సీ నిధులతో బోరు మోటారు వేయించారు. వార్డులో బిగించిన బోరుకు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సహాకారంతో పట్టణంలోని 18 వార్డులలో బోరు మోటార్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు బోరు మోటార్లు వేయించి తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ ఖాజా హుస్సేన్, నాయకులు దావులయ్య, మతీన్, అన్వర్, యూనుస్, రహీమ్, తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18494 chaithany collage