రేపు మిషన్ భగీరథ బంద్
July 14, 2023
dharshininews
రేపు మిషన్ భగీరథ బంద్
- నిలిచిపోనున్న తాగునీటి సరఫరా
- ఎందుకోసమో ప్రకటించిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో రేపు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా బంద్ అవుతున్నట్లు జిల్లా ఇంజనీర్ చల్మారెడ్డి రెడ్డి తెలిపారు. జిల్లాలోని అమనగల్లు వద్ద ఉన్న విద్యు సబ్ స్టేషన్ మరమ్మత్తులు చేపడుతున్నారని తెలిపారు. ఈ కారణంగా రేపు శనివారం తాండూరు, పరిగి మున్సిపాల్టీలతో పాటు పరిసర గ్రామాలకు మిషనర్ భగీరథ తాగునీటి సరఫరా జరగదని స్పష్టం చేశారు. ప్రజలు నేడు సరఫరా చేసే తాగునీటిని నిల్వ ఉంచుకోవాలని, ప్రత్యామ్నాయంగా సమీప బోరు మోటార్లను వినియోగించుకోవాలని సూచించారు. మరోవైపు తాండూరు మున్సిపల్ అధికారులు తాగునీటి ఇబ్బంది ఉన్న ప్రాంతంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/18520