schedule Monday, July 06, 2026

పంచాయతీ కార్మికులపై వివక్ష తగదు

calendar_today July 14, 2023
person dharshininews
పంచాయతీ కార్మికులపై వివక్ష తగదు
పంచాయతీ కార్మికులపై వివక్ష తగదు - డిమాండ్ల పరిష్కారంలో సర్కారు విఫలం - సమ్మెకు మద్దతు తెలిపిన కందుకూరి రాజ్ కుమార్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : గ్రామ పంచాయతి కార్మికులపై తెలంగాణ సర్కారు వివక్ష ప్రదర్శించడం తగదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. తాండూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద 9 రోజులుగా పంచాయతి కార్మికులు చేపడుతున్న సమ్మెకు శుక్రవారం కందుకూరి రాజ్ కుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కార్మికుల జీవితాలు మెరుగు పడతాయనుకుంటే ఇందుకు వ్యతిరేకంగా పరిస్థితి ఏర్పడిందన్నారు. న్యాయమైన 20 ఉమాండ్లను సాధించుకునేందుకు కార్మికులు సమ్మె చేస్తుంటే సర్కారు వివక్ష చూపించడం తగదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. ఇప్పకైన ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండు చేశారు. కార్మికుల డిమాండ్లు నెరవేరేంత వరకు బీసీ సంఘం అండగా ఉంటుందని కార్మికులకు భరోసా అందించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, యువజన సంఘం నాయకులు బస్వరాజ్, నరేష్, అశోక్, కృష్ణ, రామకృష్ణ, సురేందర్, కార్మికుఉల జైశ్రీరాం నర్సింలు, సాబీర్, సాయప్ప, శ్యామప్ప, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18537 chaithany collage