schedule Monday, July 06, 2026

ఎమ్మెల్సీ రాజకీయ భేటి..!

calendar_today July 15, 2023
person dharshininews
ఎమ్మెల్సీ రాజకీయ భేటి..!
ఎమ్మెల్సీ రాజకీయ భేటి..! - గురురాజ్ జోషి నివాసంలో మంతనాలు - మహేందర్ రెడ్డిని సన్మానించిన కుటుంబ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి రాజకీయ భేటిలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ముఖ్య నేతలు, కార్యకర్తల కుటుంబాలతో సమావేశం అవుతున్నారు. తాజాగా శనివారం యాలాల మండలం యాలాల మండల సీనియర్ రాజకీయ నాయకులు గురురాజ్ జోషి కుటుంబ సభ్యులను కలిశారు. వారి నివాసానికి వెళ్లి పలకరించారు. అనంతరం ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అదేవిధంగా గురురాజ్‌ జోషి అయన కుమారులు వికాస్ జోషి, శరత్ జోషి లను ఎమ్మెల్సీకి పరిచయం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వారితో మాట్లాడుతూ మీ తండ్రి బాటలో ప్రజా సేవలోకి రాజకీయాల్లోకి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ళ బాల్ రెడ్డి, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18571 chaithany collage