schedule Monday, July 06, 2026

కరుణించు కట్టమైసమ్మ..!

calendar_today July 16, 2023
person dharshininews
కరుణించు కట్టమైసమ్మ..!
కరుణించు కట్టమైసమ్మ..! - గాంధీనగర్‌లో బోనాల జాతర - దర్శించుకున్న ప్రజా ప్రతినిధులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధి గాంధీనగర్‌లో కట్ట మైసమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కరుణించు కట్ట మైసమ్మ తల్లి అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం వార్డులో వెలసిన కట్ట మైసమ్మ జాతర ఉత్సవాలు నిర్వహించారు. జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలకంరణ, పూజలు నిర్వహించారు. అమ్మవారిని వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్, అజయ్ సింగ్ ఠాకూర్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్‌ గౌడ్‌తో పాటు వార్డులోని ఇతర పార్టీలకు చెందిన నేతలు దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా వార్డుకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో దేవాలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. భక్తుల రాక, పూజలతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించకుంది. మరోవైపు అమ్మవారి జాతర సందర్భంగా బోనాల ఊరేగింపు ఉంటుందని ఆలయ కమిటి సభ్యులు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18571 chaithany collage