schedule Monday, July 06, 2026

మమ్మేలూ.. కట్ట మైసమ్మా..!

calendar_today July 16, 2023
person dharshininews
మమ్మేలూ.. కట్ట మైసమ్మా..!
మమ్మేలూ.. కట్ట మైసమ్మా..! - ఆదర్శనగర్‌లో అమ్మవారి జాతర - పూజలు నిర్వహించిన ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మమ్మేలూ.. కట్ట మైసమ్మ తల్లి అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఆదివారం పట్టణంలోని ఆదర్శనగర్ పాత కుంటలో వెలిసిన శ్రీ కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ బోనాల ఉత్సవాల సందర్భంగా తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు విఠల్‌ నాయక్ కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని పలువురు ప్రముఖులు భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ పాత కుంటలో వెలిసిన శ్రీ కట్ట మైసమ్మ మహిమగల దేవత అని, భక్తులు కోరుకున్న కోరికలను తీర్చే మహిమగల దేవత అని అన్నారు. త్వరలోనే ఆలయంలో అమ్మవారి విగ్రహం పున ప్రతిష్ట చేపట్టనున్నట్లు తెలిపారు. బోనాల సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ ప్రారంభించారు. ఈ బోనాల ఉత్సవాలు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, బీసీ జాతీయ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్, నిజామాబాద్ అడిషనల్ ఎస్పీ జి మధుసూదన్ రావు, స్థానిక కౌన్సిలర్ నీరజ బాల్‌రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షులు జె.సుధాకర్ ఉపాధ్యక్షులు వేణుగోపాల్ ప్రధాన కార్యదర్శి సుధాకర్, కార్యదర్శి కృష్ణ, కోశాధికారి రాములు, సలహాదారులు నల్ల పాపయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పట్నం రమేష్, రాజేష్, నర్సింలు, నాగప్ప, బెజ్జు రమేష్, అంచులయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18587 chaithany collage