నేడు, రేపు స్కూళ్లకు సెలవు
July 20, 2023
dharshininews
నేడు, రేపు స్కూళ్లకు సెలవు
- భారీ వర్షాల నేపథ్యంలో నిర్ణయం
- ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు నేడు, రేపు సెలవు ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితారెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నేపధ్యంలో.. ఉన్నతాధికారులు ఈ అంశాన్ని మంత్రి సబితా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నీ స్కూల్స్‌కు గురువారం, శుక్రవారం సెలవులు ప్రకటించింది. మరోవైపు ప్రైవేటు స్కూళ్లు సైతం స్వచ్చంధ సెలవులను ప్రకటించుకున్నారు. మంత్రి సబితారెడ్డి ప్రకటించిన ట్విట్టర్ లింక్ కింద ఉంది చూడండి..
https://twitter.com/SabithaindraTRS/status/1681858624619171841?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1681858624619171841%7Ctwgr%5E6005e92f2be8b26e491226f996f7c3ad65fe90ea%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftelangana%2Fhyderabad%2Ftwo-days-holidays-to-schools-in-telangana-in-awake-of-rains-1012515.html
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/18681