schedule Saturday, September 05, 2026

ఎంపీ రంజిత్‌రెడ్డికి శుభాంక్ష‌లు తెలిపిన ముర‌ళీకృష్ణ‌గౌడ్

calendar_today September 18, 2021
person dharshininews
ఎంపీ రంజిత్‌రెడ్డికి శుభాంక్ష‌లు తెలిపిన ముర‌ళీకృష్ణ‌గౌడ్
ఎంపీ రంజిత్‌రెడ్డికి శుభాంక్ష‌లు తెలిపిన ముర‌ళీకృష్ణ‌గౌడ్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : చేవేళ్ల పార్ల‌మెంట్ స‌భ్యులు గ‌డ్డం రంజిత్‌రెడ్డికి వికారాబాద్ జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ గాజీపూర్ ముర‌ళీకృష్ణ‌గౌడ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. శ‌నివారం ఎంపీ రంజిత్‌రెడ్డి జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్‌లో ముర‌ళీకృష్ణ‌గౌడ్ ఆయ‌న‌ను క‌లిశారు. ఎంపీకి పుష్ప‌గుచ్చం అందించి.. శాలువాతో స‌త్క‌రించారు. అనంత‌రం ఎంపీ రంజిత్‌రెడ్డికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. రానున్న రోజుల్లో మ‌రిన్ని ప‌దవులు అధిరోహించి అభివృద్ధి, సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని ఆకాంక్షించారు.