schedule Sunday, September 20, 2026

ప్రసంనాంజనేయ విగ్రహా ప్రతిష్టాపనకు ఆర్థిక చేయూత

calendar_today July 26, 2023
person dharshininews
ప్రసంనాంజనేయ విగ్రహా ప్రతిష్టాపనకు ఆర్థిక చేయూత
ప్రసంనాంజనేయ విగ్రహా ప్రతిష్టాపనకు ఆర్థిక చేయూత - రూ.51 వేలు విరాళం అందించిన ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం రాజీవ్ గృహకల్ప కాలనీలో ప్రతిష్ఠించే శ్రీ ప్రసన్న ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపనకు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ తోడ్పాటు అందించారు. బుధవారం కాలనీ పెద్దలకు రూ.51 వేల విరాళం అందజేశారు. రాజీవ్ కాలనీలోని వచ్చేనెల 10 నుంచి ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామి విగ్రహ ప్రతిష్టాపనతో పాటు ధ్వజస్థంభం, నవగ్రహాల ప్రతిష్టాపన నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటి సభ్యుల విజ్ఞప్తి మేరకు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ ప్రతిష్టాపన ఉత్సవాలకు రూ. 51 వేలు నగదును విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి వ్యవస్థాపకులు సాయప్ప, అధ్యక్షులు మునీందర్, సభ్యులు నర్సింలు ముదిరాజ్, వెంకట్ రెడ్డి, సంజీవరావు, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18855 chaithany collage