schedule Saturday, September 05, 2026

ఆధార్‌ అప్‌డేట్ గడువు పెంపు

calendar_today August 6, 2023
person dharshininews
ఆధార్‌ అప్‌డేట్ గడువు పెంపు
ఆధార్‌ అప్‌డేట్ గడువు పెంపు - ఏయే వివరాలను చేసుకోవచ్చంటే - ట్విట్టర్‌ లింకులను విడుదల చేసిన యూఐడీఏఐ దర్శిని డెస్క్‌: ఆధార్‌ కార్డు ఉన్న వినియోగదారులకు యూఐడీఏఐ కీలక సూచన చేసింది. ఆధార్‌ అప్‌డేట్‌ గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భారతీయుల వద్ద కచ్చితంగా ఉండాల్సిన డాక్యుమెంట్స్‌లో ఆధార్ కార్డు ముఖ్యమైనది. ప్రతి పదేళ్లకు ఒకసారి ప్రజలు తప్పనిసరిగా తమ ఆధార్‌లోని వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. ఇక ఇంటర్నెట్ వినియోగించే వారికి ఉచితంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ అవకాశం కల్పించింది. గతంలో ఆధార్ డాక్యుమెంట్స్ ఉచిత అప్డేషన్‌ను(Aadhar Updation) కొనసాగింపుగా ఈ అవకాశం కల్పించింది. ఆధార్ కార్డు ఉన్న వారు తమ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం చాలా కీలకం. అప్డేషన్ కోసం గతంలో జూన్ 14ను చివరి తేదీగా ప్రకటించిన యూఐడీఏఐ(UIDAI) ఆ తరువాత దాన్ని సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. యూనీక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. ప్రస్తుతం యూజర్లు ఆన్‌లైన్‌లో ఉచితంగా తమ వివరాలను ఆధార్‌లో పొందుపరుచుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో మార్గంలో ఆధార్ సెంటర్లలో రూ.50 చెల్లించి తమ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేషన్‌కు గడువు సమీపిస్తున్న తరుణంలో యూఐడీఏఐ మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రజలను అప్రమత్తం చేసింది. ఫోన్ నెంబర్, అడ్రస్‌ను ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేసుకోవాలో తెలుపుతూ ట్వీట్ చేసింది. తమ వివరాలు ఇంకా అప్‌డేట్ చేసుకోని వారందరూ తక్షణం తమ వివరాలను తాజా పరుచుకోవాలని సూచించింది. కింద ట్విట్టర్‌ లింకులు ఉన్నాయి చూడండి.. https://twitter.com/UIDAI/status/1684050913495752706?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1684050913495752706%7Ctwgr%5E8c5aa84d679d88600297b2a09a41b2c6cafa148a%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FUIDAI%2Fstatus%2F1684050913495752706 https://twitter.com/UIDAI/status/1686224238301093888?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1686224238301093888%7Ctwgr%5E1745639569f991b741c0006f5790db350d79c434%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FUIDAI%2Fstatus%2F1686224238301093888 ఇది కూడా చదవండి.. https://dharshininews.com/19086