schedule Saturday, September 05, 2026

ఒకే ఫోన్లో రెండు వాట్సాఫ్‌లు..!

calendar_today August 12, 2023
person dharshininews
ఒకే ఫోన్లో రెండు వాట్సాఫ్‌లు..!
ఒకే ఫోన్లో రెండు వాట్సాఫ్‌లు..! - కొత్త ఫీచర్‌ తెచ్చిన సంస్థ - ఎలా వినియోగించాలంటే..? దర్శిని డెస్క్: వాట్సాఫ్ వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్‌ అకౌంట్‌లు వినియోగించే సౌలభ్యం తీసుకవచ్చింది. ప్రస్తుతం ఒక ఫోన్‌లో కేవలం ఒకే వాట్సాప్‌ ఖాతాను వినియోగించాటానికి మాత్రమే అవకాశం ఉంది. రెండో అకౌంట్‌ను ఉపయోగించాలంటే.. మరో మోబైల్‌ ఫోన్‌ వినియోగించడమో.. లేదా క్లోన్డ్‌ వాట్సాప్ యాప్‌ అయినా ఉపయోగించాల్సి ఉంటుంది. రెండు వాట్సాప్ ఖాతాలు ఉపయోగించటం కోసం రెండు మొబైల్స్‌ వాడాలంటే కష్టం. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో ఒకే వాట్సాప్‌తో వేర్వేరు అకౌంట్లు వినియోగించవచ్చు. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన వారు వాట్సాప్‌ అకౌంట్‌లో క్యూఆర్ కోడ్ ఆప్షన్ వద్ద ఉన్న ‘యారో (బాణం)’ ఐకాన్‌ సాయంతో మరో అకౌంట్‌ని యాడ్‌ చేసుకోవచ్చు. దీంతోనే వేరే ఖాతాకు మారవచ్చు. అప్పుడు వినియోగదారులు ఒకే ఫోన్లో వేర్వేరు నంబర్లతో వాట్సాప్‌ ఖాతాలను నిర్వహించే సౌలభ్యాన్ని పొందవచ్చు. ఒక ఖాతాలో ప్రైవేటు చాట్‌లు, మరో ఖాతాలో వృత్తికి సంబంధిచిన సంభాషణలు జరపవచ్చు. అయితే ప్రస్తుతం వాట్సాప్‌ బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిందని వాట్సాప్‌ తెలిపింది. ఇప్పటికే లాక్‌చాట్‌, స్క్రీన్ షేరింగ్, మల్టీ డివైజ్‌ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్.. ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఒకే వాట్సాప్‌ యాప్‌లో వేర్వేరు ఖాతాలను ఉపయోగించే వెసులుబాటు కల్పించింది. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/19237