schedule Monday, July 06, 2026

కేబీనెట్ మంత్రి మహేందర్ రెడ్డి

calendar_today August 24, 2023
person dharshininews
కేబీనెట్ మంత్రి మహేందర్ రెడ్డి
కేబీనెట్ మంత్రి మహేందర్ రెడ్డి - గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం - హాజరైన కేసీఆర్, మంత్రులు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ చేతులమీదుగా ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పట్నం మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు 150 మంది అతిథులు హాజరయ్యారు. ఇక మంత్రి ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌ పూల తోరణాలతో అలంకరించారు. కాగా, రెండోసారి మంత్రి పదవి చేపట్టనున్న మహేందర్‌ రెడ్డికి శుభాకాంక్షాలు చెప్పేందుకు నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అయితే మహేందర్ రెడ్డికి ఏ మంత్రి పదవి ఇచ్చారని సస్పెన్స్‌ ఏర్పడింది. అయితే హెల్త్ మినిస్టరీ ఇవ్వడం ఖాయమని నేతలు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19611