schedule Saturday, September 19, 2026

హస్తానికి కొత్త సారథులు..!

calendar_today September 8, 2023
person dharshininews
హస్తానికి కొత్త సారథులు..!
హస్తానికి కొత్త సారథులు..! - పట్టణం, మండలాలకు కొత్త అధ్యక్షులు - ప్రకటించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్‌ మహరాజ్ తాండూరు, దర్శినిప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీలో కొత్త సారథులు నియామకం అయ్యారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వీరి ఎన్నిక జరిగింది. టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం. రమేష్‌ మహరాజ్ కొత్త అధ్యక్షులను ప్రకటించారు. తాండూరు పట్టణ అధ్యక్షులుగా హబీబ్ లాల, తాండూరు మండల అధ్యక్షులుగా జన్నె నాగప్ప, పెద్దేముల్ మండల అధ్యక్షులుగా కొండాపురం గోపాల్, యాలాల మండల అధ్యక్షులుగా ఎం.నర్సిరెడ్డి, బషీరాబాద్‌ మండల అధ్యక్షులుగా కలాల్ నర్సింలు గౌడ్‌లను ప్రకటించారు. అనంతరం నాలుగు మండలాల అధ్యక్షులు, తాండూరు పట్టణానికి నూతన అధ్యక్షులుకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఎం.రమేష్‌ మహరాజ్ మాట్లాడుతూ టీపీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రంతో పాటు తాండూరు నియోజకవర్గ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు పార్టీ కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం పాటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనీ అధికారంలో తీసుకవచ్చేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20073/