schedule Saturday, September 19, 2026

మంత్రుల పర్యటనను అడ్డుకోవద్దు...!

calendar_today September 27, 2023
person dharshininews
మంత్రుల పర్యటనను అడ్డుకోవద్దు...!
మంత్రుల పర్యటనను అడ్డుకోవద్దు...! - అంగన్ వాడీలు, నేతలతో తాండూరు డీఎస్పీ - వినతిపత్రం అందజేతకు అవకాశం - సమ్మెకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో జరుగుతున్న మంత్రుల పర్యటనను అడ్డుకోవద్దని స్థానిక డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ అంగన్ వాడీలకు, మద్దతు నేతలకు సూచించారు. 17 రోజులుగా తాండూరులో అంగన్ వాడి టీచర్లు, హెల్పర్లు సమ్మె చేస్తున్నారు. బుధవారం తాండూరులో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, గనుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డిల పర్యటన నేపథ్యంలో అడ్డుకునే సూచనలు కనిపించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.   ఇందులో భాగంగా తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో సమ్మెలో పాల్గొన్న అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లతో పాటు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, సీఐటీయ నాయకులు శ్రీనివాస్ లతో డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడారు. మంత్రుల పర్యటనను అడ్డుకోవద్దని సూచించారు. డిమాండ్లపై మంత్రులకు వినతిపత్రం అందించేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. నేతలు, అంగన్ వాడిలతో 10 మందితో వినతి పత్రాలను అందించేందుకు సౌకర్యం కల్పించేలా చూస్తామన్నారు. శాంతియుతంగా సమ్మె చేపట్టుకోవాలని, అడ్డుకునేందుకు యత్నిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రంలో పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, మహిళ ఎస్ఐ విమల, అంగన్ వాడీ యూనియన్ నాయకులు ఉన్నారు.     ఇది కూడా చదవండి... https://dharshininews.com/20651/