schedule Saturday, July 04, 2026

మోగిన ఎలక్షన్ నగారా..!

calendar_today October 9, 2023
person dharshininews
మోగిన ఎలక్షన్ నగారా..!
మోగిన ఎలక్షన్ నగారా..! - తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్ - ప్రకటించిన ఎన్నికల కమిషన్ దర్శిని డెస్క్ : దేశంలోని తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాలలో ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించారు. ఈ ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. షెడ్యూల్ ఇలా.. నోటిఫికేషన్ నవంబర్ 3 2023. దరఖాస్తుల స్వీకరణ: నవంబర్ 10 2023. దరఖాస్తుల ఉపసంహరణ,నవంబర్ 15 2023. దరఖాస్తుల స్క్రూటినీ: నవంబర్ 13 2023. పోలింగ్ తేదీ: నవంబర్ 30 2023. ఎన్నికల కౌంటింగ్: డిసెంబర్ 3 2023 జరుగుతుండగా.. ఓటింగ్‌కు రెండు రోజుల ముందు ప్రచారం నిలిచిపోతుంది.