schedule Saturday, September 19, 2026

మెనిఫెస్టోలో ప్రియారిటి మస్ట్..!

calendar_today October 13, 2023
person dharshininews
మెనిఫెస్టోలో ప్రియారిటి మస్ట్..!
మెనిఫెస్టోలో ప్రియారిటి మస్ట్..! - అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యమివ్వాలి - బడ్జెట్లో 3వ వంతు, చట్ట సభల్లో 50శాతం రిజర్వేషన్ - బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీలు ప్రవేశ పెట్టే మెనిఫెస్టోలలో బీసీల డిమాండ్లకు ప్రాధాన్యమివ్వాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తరువాత బడుగు బలహీన వర్గాలు ఆర్ధికంగా, రాజకీయంగా, విద్యా, వ్యాపార పరంగా ఎంతో అభివృద్ధి చెందుతారని ఆశపడి భంగపడ్డారని ఆవేధన వ్యక్తం చేశారు. 65 శాతంపైగా ఉన్న బీసీలు ఎంతో నష్టపోయారన్నారు. ఇప్పటికైనా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశ పెట్టే మెనిఫెస్టోలలో బీసీల డిమాండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు మూడో వంతు కేటాయించాలన్నారు. బీసీ కులాలకు కార్పోరేషన్ ఫెడరేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించేందుకు తీర్మానం చేయాలన్నారు. అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి సిఫార్సు చేసేలా మెనిఫెస్టో ఉండాలన్నారు. అదేవిధంగా కుల, జనగణను తప్పనిసరిగా చేపడ్డాలని డిమాండ్ చేశారు. విద్యా, ఉద్యోగ రంగాలలో ఉన్నతీకరణకు కృషి చేయాలన్నారు. ఉపాధి రంగంలో బీసీలకు భరో సా కల్పించే విధంగా మెనిఫెస్టోను రూపొందించాలన్నారు. ఇందుకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీలకు బీసీ మద్దతు అందిస్తామని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21035/