schedule Saturday, July 04, 2026

గెలుపు గుర్రాలకే 'తొలి'హస్తం..!

calendar_today October 15, 2023
person dharshininews
గెలుపు గుర్రాలకే 'తొలి'హస్తం..!
గెలుపు గుర్రాలకే 'తొలి'హస్తం..! - ఆశావాహాలుకు దక్కని ఊరట - రెండో జాబితాలో వామపక్షాలకు చాన్స్ - కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు గుర్రాలకు ప్రాధాన్యం ఇచ్చింది. తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం కాంగ్రెస్‌ విడుదల చేసింది. గెలుపుకు అస్కారం ఉన్న వారికి తొలిహస్తం అందించింది. మొత్తం 55 మందితో ఈ జాబితాను ప్రకటించింది. తొలి జాబితా ప్రకారం.. మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు దక్కాయి. సిట్టింగ్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ హుజూర్‌ నగర్‌ నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి కోదాడ టికెట్‌ కేటాయించారు. కొడంగల్‌ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేయనున్నారు. పొత్తుల్లో భాగంగా వామపక్షాలు భద్రాచలం టికెట్‌ను డిమాండ్‌ చేసినప్పటికీ.. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకే మళ్లీ ఆ స్థానం కేటాయించారు. వామపక్షాలతో పొత్తుపై ఇవాళ స్పష్టత రానుంది. అనంతరం మిగతా స్థానాలపై చర్చించి బుధ, గురువారాల్లో రెండో జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఖమ్మం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే, మొదటి జాబితాలో వీరి పేర్లు లేకపోవడం గమనార్హం.(జాబితా కింద చూడండి) కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే.. బెల్లంపల్లి (ఎస్సీ) - గడ్డం వినోద్‌ మంచిర్యాల - ప్రేమ్‌సాగర్‌ రావు నిర్మల్‌ - శ్రీహరి రావు ఆర్మూర్‌ - ప్రొద్దుటూరి వినయ్‌ కుమార్‌ రెడ్డి బోధన్‌ - సుదర్శన్‌ రెడ్డి బాల్కొండ - సునీల్‌ కుమార్‌ ముత్యాల జగిత్యాల - జీవన్‌ రెడ్డి ధర్మపురి (ఎస్సీ) - లక్ష్మణ్‌ కుమార్‌ రామగుండం - రాజ్‌ ఠాకూర్‌ మంథని - దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పెద్దపల్లి - చింతకుంట విజయ్‌ రమణారావు వేములవాడ - ఆది శ్రీనివాస్‌ మానకొండూరు (ఎస్సీ) - కవ్వంపల్లి సత్యనారాయణ మెదక్‌ - మైనంపల్లి రోహిత్‌ రావు అందోల్‌ (ఎస్సీ) - దామోదర రాజనర్సింహ జహీరాబాద్‌ (ఎస్సీ) - ఆగం చంద్రశేఖర్‌ సంగారెడ్డి - జగ్గారెడ్డి గజ్వేల్‌ - తూముకుంట నర్సారెడ్డి మేడ్చల్‌ - తోటకూర వజ్రేశ్‌ యాదవ్‌ మల్కాజిగిరి - మైనంపల్లి హన్మంతరావు కుత్బుల్లాపూర్ - కొలన్‌ హన్మంత్‌ రెడ్డి ఉప్పల్‌ - పరమేశ్వర్‌ రెడ్డి చెవేళ్ల (ఎస్సీ) - భీమ్‌భరత్‌ పరిగి - టి. రామ్మోహన్‌ రెడ్డి వికారాబాద్‌ - గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ముషీరాబాద్‌ - అంజన్‌కుమార్‌ యాదవ్‌ మలక్‌పేట - షేక్‌ అక్బర్‌ సనత్‌నగర్‌ - కోట నీలిమ నాంపల్లి - ఫిరోజ్‌ ఖాన్‌ కార్వాన్‌ - ఉస్మాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌హజ్రి గోషామహల్‌ - మొగిలి సునీత చాంద్రయణగుట్ట - బోయ నగేశ్‌ (నరేశ్‌) యాకత్‌పుర - కె. రవి రాజు బహదూర్‌పుర - రాజేశ్‌ కుమార్‌ పులిపాటి సికింద్రాబాద్‌ - ఎ.సంతోష్‌ కుమార్‌ కొడంగల్‌ - రేవంత్‌ రెడ్డి గద్వాల - సరితా తిరుపతయ్య అలంపూర్‌ (ఎస్సీ)- సంపత్‌ కుమార్‌ నాగర్‌కర్నూల్‌ - కె. రాజేశ్‌ రెడ్డి అచ్చంపేట్‌(ఎస్సీ) - సీహెచ్‌ వంశీకృష్ణ కల్వకుర్తి - కసిరెడ్డి నారాయణ్‌ రెడ్డి షాద్‌ నగర్‌ - కె. శంకరయ్య కొల్లాపూర్‌ - జూపల్లి కృష్ణారావు నాగార్జున సాగర్‌ - కుందూరు జయవీర్‌ హుజూర్‌ నగర్‌ - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కోదాడ - పద్మావతి రెడ్డి నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నకిరేకల్‌ (ఎస్సీ)- వేముల వీరేశం ఆలేరు - బీర్ల ఐలయ్య స్టేషన్‌ ఘన్‌పూర్‌ (ఎస్సీ) - సింగాపురం ఇందిర నర్సంపేట - దొంతి మాధవ్‌ రెడ్డి భూపాలపల్లి - గండ్ర సత్యనారాయణ రావు ములుగు (ఎస్టీ) - సీతక్క మధిర (ఎస్సీ)- మల్లు భట్టి విక్రమార్క భద్రాచలం - పొదెం వీరయ్య ఇది కూడా చదవండి... https://dharshininews.com/21080/