schedule Saturday, September 19, 2026

పర్యాదను మెచ్చిన మిత్రులు

calendar_today October 21, 2023
person dharshininews
పర్యాదను మెచ్చిన మిత్రులు
పర్యాదను మెచ్చిన మిత్రులు - విద్యారత్న పురస్కారంపై హర్షం - సన్మానించిన స్నేహితులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన పర్యాద రామకృష్ణను అతని స్నేహితులు మెచ్చుకున్నారు. అతను జాతీయ పురస్కారం అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యా పరంగా బహుజనులకు సాయం అందించడం పట్ల ఢిల్లీకి చెందిన బహుజన సాహిత్య అకాడమి పర్యాద రామకృష్ణకు విద్యారత్న అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే దేశరాజదానిలో రామకృష్ణ అవార్డును అందుకున్నారు. ఇందులో భాగంగా శనివారం పర్యాద రామకృష్ణను అతని స్నేహితులు సన్మానించారు. విద్యార్థుల్లో సామాజిక దృక్పథాన్ని పెంపొందిస్తూ, వారిని సమాజంలో భాగం చేస్తూ వారియొక్క లక్ష్యాలను చేరే విధంగా ప్రోత్సాహిస్తున్నందుకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు, భవిష్యత్తులో విద్యారంగాభివృద్ధికి తమ మిత్రుడు కృషిచేస్తూ మరిన్ని అవార్డులు పొందాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో వారి మిత్రులు కటకం హరీష్ కుమార్, అంతారం కిరణ్, గుబ్బ నరేష్, అస్తికర్ ఆశిష్, కనకం శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21209/