schedule Saturday, September 19, 2026

టిక్కెట్‌ మనోహర్ రెడ్డికే..!

calendar_today October 27, 2023
person dharshininews
టిక్కెట్‌ మనోహర్ రెడ్డికే..!
టిక్కెట్‌ మనోహర్ రెడ్డికే..! - తాండూరు అభ్యర్థిగా ప్రకటన లాంచనమే - కేఎల్‌ఆర్‌ వెనుకడుతో లైన్‌ క్లీయర్ - మరో చోట నుంచి బరిలోకి కేఎల్‌ఆర్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ కాంగ్రెస్ టిక్కెట్టు మనోహర్ రెడ్డి కైవసం కాబోతోంది. రెండో జాబితాలో ఆయన పేరు ప్రకటన లాంచనంగా మారింది. అయితే తాండూరు టిక్కెట్టు కోసం పట్టుబట్టిన మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్ఆర్‌)ను తప్పుకునేలా పార్టీ నేతలు ఒప్పించారు. రాహుల్ గాంధీతో భేటీ తరువాత పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాండూరు నుంచి పోటిలో కేఎల్ఆర్ తప్పుకోవడంతో ఇటీవల కాంగ్రెస్‌ లో చేరిన బుయ్యని మనోహర్ రెడ్డికి లైన్ క్లియర్ అయ్యింది. మొదటి నుంచి తాండూరు టిక్కెట్ తనకే వస్తుందని ధీమాలో మనోహర్ రెడ్డి కార్యక్రమాలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అసంతృప్తి నేతలను సైతం పార్టీలోకి తీసుకవచ్చారు. తాండూరు టిక్కెట్ మనోహర్ రెడ్డికి దక్కుతుందని తేలడంతో నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు తాండూరు పోటీ నుంచి తప్పుకున్న కేఎల్‌ఆర్ మహేశ్వరం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నట్లు అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 23 ఏండ్ల తరువాత మహేశ్వరంలో మంత్రి సబితారడ్డి, కేఎల్ఆర్‌లు మళ్లీ ఢీ కొంటున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21333/