schedule Saturday, September 19, 2026

కారు.. కాంగ్రెస్‌ ఢీ..!

calendar_today October 30, 2023
person dharshininews
కారు.. కాంగ్రెస్‌ ఢీ..!
కారు.. కాంగ్రెస్‌ ఢీ..! - సవాళ్లు.. ప్రతి సవాళ్లు - జోరుమీదున్న గులాబీ - ధీటుగా దూసుకపోతున్న హస్తం - విశ్లేషకులు, ప్రజలు ఏమనుకుంటున్నారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో రాజకీయాలు కాకమీద ఉన్నాయి. ముఖ్యంగా కారు.. కాంగ్రెస్‌ల మద్య వార్‌ జరుగుతోంది. విస్తృతంగా కొనసాగుతున్న ప్రచార పర్వంలో విమర్శలు, ప్రతి విమర్శలతో ఢీ కొంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో అబ్యర్థుల ప్రకటన తరువాత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రచారంలో దూసుకపోతున్నారు. నియోజకవర్గంలోని మండలాలతో పాటు పట్టణంలో ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజలకు దగ్గరయ్యారు. గత మూడు రోజులుగా పట్టణంలో పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూనే ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడంతో ప్రచారం ఆలస్యం అయ్యింది. తాండూరు టిక్కెట్ తనకే వస్తుందనే నమ్మకంతో డీసీసీబీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టలో చేరారు. అతని సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్‌లతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీల నుంచి ముఖ్య నేతల చేరికలతో పాటు, టిక్కెట్ కన్ఫామ్ కావడం.. తాండూరులో రోడ్‌ షోతో కాంగ్రెస్ ఊపుమీదకు వచ్చింది. ఈ క్రమంలో రెండు పార్టీల మద్య విమర్శలు, ప్రతి విమర్శలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయాలు వేడెక్కాయి. తాజా జరుగుతున్న పరిణామాలపై ఏ పార్టీ బలమెంతో అని రాజకీయ విశ్లేషకులు, సామాన్యులు బేరీజు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఊపు మీదు ఉన్న కూడా ప్రజల్లోకి మరింత చొచ్చుచకపోవాలని అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా అభ్యర్థి మనోహర్ రెడ్డి ప్రజల్లో కలసిపోతే బంపర్ మెజార్టీ ఖాయమని అంటున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21405/