schedule Sunday, September 06, 2026

సారు.. వస్తుండ్రూ...!

calendar_today November 5, 2023
person dharshininews
సారు.. వస్తుండ్రూ...!
సారు.. వస్తుండ్రూ...! - 22న తాండూరుకు సీఎం కేసీఆర్ - ఖరారైన్ మలి విడత ప్రచార షెడ్యూల్ వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఖరారయ్యింది. బీఆర్‌ఎస్‌ ప్రచారపర్వంలో దూసుకెళ్తోంది. రంగంలోకి దిగిన భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాశీర్వాద సభలతో ఇప్పటికే మొదటి విడత ప్రచారం కొనసాగుతోంది. ఈనెల 9న నామినేషన్ వేసిన తరువాత ప్రచారానికి స్పల్ప విరామం ఇస్తారు. మళ్లీ ఈనెల 13 నుంచి 28 వరకు సీఎం కేసీఆర్‌ మలివిడత ప్రచారం మొదలు పెట్టనున్నారు. రెండో విడత ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ 54 సభల్లో ప్రసంగించనున్నారు. 25న గ్రేటర్‌ మొత్తానికి కలిపి ఒకే ఒక సభ ఉండనుంది. ఖరారైన షెడ్యూల్‌లో వికారాబాద్‌ జిల్లాలో కూడా పర్యటన ఉంటుందని స్పష్టమవుతోంది. 22న తాండూరు, కోడంగల్, పరిగి, మహబూబ్ నగర్‌ లో పర్యటన ఉండగా 23న మహేశ్వరం, వికారాబాద్‌లో కూడా ఉంటుందని షెక్యూల్ ప్రకారం తెలుస్తోంది. కేసీఆర్ మలివిడత ప్రచార షెడ్యూల్‌ ఇదే... 13న అశ్వారావు పేట, బూర్గంపహాడ్‌, నర్సంపేట 14న పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం 15 న బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌ , ఎల్లారెడ్డి, మెదక్‌ 16న ఆదిలాబాద్‌, బోథ్‌, నర్సాపూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ 17న కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌, పరకాల 18న చేర్యాల 19న అలంపూర్‌, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి 20న మానకొండూర్, స్టేషన్‌ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండ 21న మధిర, వైరా, డోర్నకల్‌, సూర్యాపేట 22న తాండూర్‌, కొడంగల్‌, మహబూబ్‌నగర్‌, పరిగి 23న మహేశ్వరం, వికారాబాద్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి 25న గ్రేటర్‌ హైదరాబాద్‌లో కేసీఆర్‌ భారీ బహిరంగ సభ 26న ఖానాపూర్‌, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక 27న షాద్‌నగర్‌, చేవెళ్ల, ఆంధోల్‌, సంగారెడ్డి 28న వరంగల్‌ ఈస్ట్‌, వరంగల్‌ వెస్ట్‌, గజ్వేల్‌ ఇలా రెండో విడతలో సీఎం కేసీఆర్‌ మొత్తం 54 సభల్లో పాల్గొననున్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21550/