schedule Monday, July 06, 2026

రేవంత్ రెడ్డి ఆస్తులు రూ. రూ.23 కోట్లు

calendar_today November 7, 2023
person dharshininews
రేవంత్ రెడ్డి ఆస్తులు రూ. రూ.23 కోట్లు
రేవంత్ రెడ్డి ఆస్తులు రూ. రూ.23 కోట్లు - రూ. 86 లక్షల అప్పులు - 89 కేసులు ఉన్నట్లు వెల్లడి వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ఎన్నికల నామినేషన్‌లో అభ్యర్థులు సమర్పించి అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులు, కేసులు వివరాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో వికారాబాద్‌ జిల్లాలో కోడంగల్‌ నుంచి పోటీ చేస్తున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి అఫిడవిట్‌పై అందరి దృష్టి పడింది. సోమవారం కొడంగల్ రిటర్నింగ్ అధికారికి రేవంత్ రెడ్డి అఫిడవిట్‌ అందజేశారు. అందులో తనతో పాటు భార్య పేరిట మొత్తం రూ.23 కోట్ల స్థిర ఆస్తులు ఉన్నట్లు చూపించారు. రేవంత్‌ రెడ్డి పేరిట రూ.8.62 కోట్ల స్థిర ఆస్తులు ఉండగా భార్య పేరిట రూ.15.02 కోట్ల స్థిర ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.2.18 కోట్ల చరాస్తులు ఉండగా భార్య పేరిట రూ.2.92 కోట్ల విలువైన చరాస్తులు ఉన్న ట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. భార్య వద్ద రూ.83 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, వజ్రాలు ఉన్న ట్లు వెల్లడించారు. రేవంత్రెడ్డి తన చేతిలో రూ. 5.34 లక్షలు, భార్య చేతిలో రూ.6.40 లక్షలు ఉ న్నట్లు పేర్కొన్నారు. బ్యాంకులో తన పేరిట రూ.86 లక్షల అప్పు ఉన్నట్లు చూపించారు. హైదరాబాద్ శివారులోని పలు ప్రాంతాలలో తన పేరుతో పాటు భార్య పేరిట ఉన్న వ్యవసాయ, వ్యవసాయేతర భూములను అఫిడవిట్లో వెల్ల డించారు. కల్వకుర్తితో పాటు జూబ్లీహిల్స్ లో రెండు భవనాలు ఉన్నట్లు రేవంత్రెడ్డి వెల్లడిం చారు. భార్యపేరిట బంజారాహిల్స్ తో పాటు జూ బ్లీహిల్స్ సొసైటీలో నివాసాలు ఉన్నట్లు పేర్కొ న్నారు. మరోవైపు రేవంత్‌ రెడ్డిపై మొత్తం 89 కేసులు ఉన్నట్లు.. ఈ కేసులకు సంబంధించిన మొత్తం సమాచారంను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21623/