schedule Saturday, September 05, 2026

సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం

calendar_today December 7, 2023
person dharshininews
సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం
సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం - తెలంగాణలో కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా ఘనత - హాజరైన సోనియా గాంధీ, అగ్రనేతలు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా కన్న కల సాకారమైంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తొలి, నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై రేవంత్ రెడ్డితో ప్రమాణం చేయించారు. అంతకుముందు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్‌ కార్యకర్తల కేరింతలు మధ్య ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ హాజరయ్యారు. సోనియాగాంధీతో కలిసి రేవంత్‌ వేదిక వద్దకు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి ముఖ్యమంత్రి పదవి పొందిన నేతగా రేవంత్ రెడ్డి ఘనతను సాధించారు. అదేవిధంగా ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ఎల్బీ స్టేడియం పరిసరాలు కిక్కిరిసి పోయాయి. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22450/