schedule Saturday, July 04, 2026

శివునికి త్రివ‌ర్ణ వ‌స్త్రాలంక‌ర‌ణ

calendar_today August 15, 2021
person dharshininews
శివునికి త్రివ‌ర్ణ వ‌స్త్రాలంక‌ర‌ణ
- దేశ‌భ‌క్తిని చాటుకున్న పూజారి తాండూరు, ఆగ‌స్టు 15 (ద‌ర్శిని) : నీల‌కంఠ స్వ‌రూపుడు అయిన శివుడు త్రివ‌ర్ణ వ‌స్ర్తాలంక‌ర‌ణ‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఆదివారం 75 వ స్వాతంత్ర్య దినో్త్సవ వేడుకుల‌ను పుర‌స్క‌రించుకుని వికారాబాద్ జిల్లా తాండూరు ప‌ట్ట‌ణం భ‌ద్రేశ్వరాల‌యంలో ఆల‌య పూజారి విజ‌య‌కుమార్ స్వామి శివున్ని ప్ర‌త్యేకంగా అలంక‌రించారు. శివ‌లింగానికి జాతీయ జెండాను అలంక‌రించి పూజ‌లు నిర్వ‌హించారు. దీంతో భ‌క్తులు త్రివ‌ర్ణ వ‌స్త్రాలంక‌ర‌ణ‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన శివున్ని ద‌ర్శించుకున్నారు. మ‌రోవైపు ప్ర‌తి యేడాది ఆల‌య పూజారి విజ‌య‌కుమార్ స్వామి ఆల‌యంలో వెల‌సిన‌ శివున్ని ప్ర‌త్యేకంగా అలంక‌రించి దైవ భ‌క్తితో పాటు దేశ‌భ‌క్తిని చాటుకుంటున్నారు.