schedule Saturday, July 04, 2026

శరీరాన్ని చక్కబెట్టే జీడిపప్పు..!

calendar_today January 23, 2024
person dharshininews
శరీరాన్ని చక్కబెట్టే జీడిపప్పు..!
శరీరాన్ని చక్కబెట్టే జీడిపప్పు..! - తింటే ఈ సమస్యలన్నీ మాయం - కొలెస్ట్రాల్‌పై ఎలా పనిచేస్తుందంటే..? దర్శిని డెస్క్‌ : ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే డ్రై ఫ్రూట్స్ తింటే ఎన్ని లాభాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి రోజూ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి జీడి పప్పు. జీడి పప్పుతో ఒక్కటేంటి.. చాలా రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో పాటు రక్త హీనత, కొలెస్ట్రాల్‌ తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. జీడి పప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను మరిన్ని ఇక్కడ తెలుసుకుందాం. - జీడి పప్పులో ప్రోయాంతో సైనిడిన్స్ అనే ఫ్లేవనాల్ పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలు పెరగడకుండా చూడటంలో సహాయ పడుతుంది. - జీడిపప్పులో జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంది. దీని వల్ల కంటి చూపు బాగా మెరుగు పడుతుంది. - డయాబెటీస్‌తో బాధ పడేవారు జీడిపప్పు తినడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. - జీడి పప్పు తినడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. దీంతో శరీర భాగాలన్నీ చక్కగా పని చేస్తాయి. - మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా జీడిపప్పు తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో ఉండే మెగ్నీషియం.. మైగ్రేన్ తగ్గించేందుకు ఉపయోగ పడుతుంది. - కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. ఎముకలు బలంగా, దృఢంగా తయారవుతాయి. ఎముకల దృఢత్వాన్ని పెంచడంలో జీడిపప్పు బాగా సహాయ పడుతుంది. - చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో కూడా జీడి పప్పు హెల్ప్ చేస్తుంది. - చాలా మంది జీడి పప్పు తింటే బరువు పెరుగుతారు అనుకుంటారు. కానీ జీడి పప్పును మితంగా తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. గమనిక: ఇది అవగాహన కోసం మాత్రమే ఈ కథనం అందించడం జరిగింది. అంతకుమించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23332/