schedule Saturday, July 04, 2026

అల్ల నేరుడు ఆకులో అద్భుత గుణాలు..!

calendar_today January 29, 2024
person dharshininews
అల్ల నేరుడు ఆకులో అద్భుత గుణాలు..!
అల్ల నేరుడు ఆకులో అద్భుత గుణాలు..! - దీని 'టీ'ని ట్రై చేస్తే మంచి ప్రయోజనాలు - వివిధ రోగాల సమస్యల నుంచి దూరం దర్శిని డెస్క్ : ఆయుర్వేదంలో అల్ల నేరేడు పండును అపర సంజీవనిగా పిలుస్తారు. మన ఆరోగ్యానికి నేరేడు పండు యే కాకుండా నేరేడు పండు చెట్టు ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ చెట్టు యొక్క ఆకులు రక రకాల వ్యాధులను నయం చేస్తాయి. ఈ పండులో విటమిన్‌ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. నేరేడు పండు మాత్రమే కాక ఆకులు, గింజలు, చెట్లు బెరడు సైతం అనేక ఔషధ తయారీలో వాడుతారు. జ్ఞాపకశక్తి మెరుగు పరచుకోవాలంటే నేరేడు పండు తినమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం, నోటిపూత, చిగుళ్ళ వ్యాధులు, దంతక్షయం, మూత్రంలో మంట తదితర సమస్యలకు నేరేడు పండ్లు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. ఆకుల టీతో ప్రయోజనాలు అల్ల నేరేడు పండ్ల ఆకులతో తయారు చేసిన టీని క్రమం తప్పకుండా తాగితే, మీరు వివిధ సమస్యలకు పరిష్కారాలను పొందగలుగుతారు. అల్ల నేరేడు పండ్ల ఆకులతో చేసిన టీకి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించే సామర్థ్యం ఉంది. నేరేడు పండు ఆకులతో తయారు చేసిన టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలు తగ్గుతాయి. రక్తాన్ని శుద్ది చేయడంలో కీలకం నేరేడు పండ్లకు రక్తాన్ని శుద్ధి చేసే గుణంతో పాటు నేరేడు పండ్ల రసాన్ని నిమ్మరసంతో కలిపి గాయాలున్న చోట పూస్తే గాయాలు త్వరగా మానుతాయి. జిగుట విరేచనాలతో బాధపడేవారు రోజుకు 2-3 చెంచాల నేరేడు రసం తీసుకుంటే శక్తితో పాటు పేగుల కదలిక నియంత్రణలో ఉంటుంది. కాలేయం పనితీరు మెరుగుపరచడంలో నేరేడు ఆకలు ఉపయోగపడతాయి. నేరేడు ఆకుల కషాయంను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. జ్వరానికి చెక్‌.. తీవ్ర జ్వరంతో బాధపడేవారికి కూడా నేరేడు ఆకులు ఉపయోగపడతాయి. నేరేడు ఆకుల రసంలో ధనియాలు వేసి తీసుకున్నట్లయితే జ్వరం తగ్గిపోతుంది. దంత సమస్యలు దూరం నేరేడు ఆకులను నమిలి నీళ్లతో పుక్కలిచ్చి ఉమ్మేస్తే నోటిదుర్వాసన తగ్గుతుంది. ఆకు రసంతో పసుపు కలిపి పురుగు కుట్టిన చోట దురదలు సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తే ఉపశమనం ఉంటుంది. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23502/