schedule Saturday, July 04, 2026

వచ్చే నెల నుంచే గృహజ్యోతి..!

calendar_today February 19, 2024
person dharshininews
వచ్చే నెల నుంచే గృహజ్యోతి..!
వచ్చే నెల నుంచే గృహజ్యోతి..! - అమలుకు సర్కారు కసరత్తు - షరతులు వర్తిస్తాయని స్పష్టం హైదారాబాద్, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లోని గృహజ్యోతి పథకంపై సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకం అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పొందాలంటే కొన్ని షరుతులు వర్తిస్తాయని చెబుతోంది. కొన్ని నియమాలు పెడుతూ కొత్త ట్విస్ట్‌లు ఇచ్చింది. కానీ ఉచిత విద్యుత్‌కు దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారో మాత్రం తెలియడం లేదు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని అములు చేయాలనుకుంటోంది. గృహజ్యోతి కోసం ఇప్పటివరకు 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రేషన్‌కార్డు ఉన్న వారి దరఖాస్తుల సంఖ్య 64 లక్షలుగా ఉంది. మళ్ళీ వీరిలో 34లక్షల 59 వేల 585 మందికి మాత్రమే గృహజ్యోతి వర్తిస్తుందని గవర్నమెంట్ అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఇక గృహజ్యోతి పథకం అమలుకు రూ.4వేల 164 ఖర్చు అవుతుందని తెలిపారు. వర్తించే షరతులు ఇవే... గృహజ్యోతి సథకానికి తెలంగాణ ప్రభుత్వం ఈ షరుతులు వస్తాయని చెబుతోంది. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారే పథకానికి అర్హులు అని కూడా చెబుతోంది. రేషన్‌కార్డు ఆధార్‌తో లింకై ఉండాలని తెలపింది. ఈ నిబంధనలు అన్నీ ఉన్నవారికే గృహజ్యోతిని ఇస్తామని స్పష్టం చేసింది. దాంతో పాటూ నెలకు 200 యూనిట్ల గరిష్ట పరిమితి దాటని వారికే పథకం అమలు వర్తిస్తుందని చెబుతోంది. నెల వినియోగం 200 యూనిట్లు దాటితే ఉచితం వర్తించదని స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి... https://dharshininews.com/23986/