schedule Saturday, July 04, 2026

పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు

calendar_today February 29, 2024
person dharshininews
పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు
పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు - కోడంగల్ లో పోలింగ్ కేంద్రం - ఓటర్ల వివరాలు కూడా సిద్దం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వికారాబాద్ జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి పాలమూరులో స్థానిక సంస్థల కోటా కింద రెండో స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ కూడా ప్రకటించింది. పాలమూరుతో పాటు వికారాబాద్‌ జిల్లాలో కూడా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. అయితే ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు. బుధవారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ఈవీఎంల గిడ్డంగి ఆవరణలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీ పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మహబూబ్ నగర్ శాసనమండలి ఎన్నికకు సంబంధించి కొడంగల్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కేంద్రంలో 55 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీంతో జిల్లలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/24197/