schedule Saturday, July 04, 2026

బీఆర్ఎస్‌ నుంచి రంజిత్ రెడ్డి జంప్..!

calendar_today March 17, 2024
person dharshininews
బీఆర్ఎస్‌ నుంచి రంజిత్ రెడ్డి జంప్..!
బీఆర్ఎస్‌ నుంచి రంజిత్ రెడ్డి జంప్..! - కాంగ్రెస్‌లో చేరికకు ముహుర్తం ఖరారు..? - చేవేళ్ల పార్లమెంట్‌ నుంచి పోటీకి అవకాశం వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు అంతా హస్తం గూటికి చేరుకుంటున్నారు. ఇటీవలే సిట్టింగ్ వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌ బీఆర్‌ఎస్‌కి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన చేవేళ్ల పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. రేపు సోమవారం ఆయన పార్టీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్న రంజిత్ రెడ్డి తెలంగాణ ఏర్పాటు తరువాత కేటీఆర్‌తో సన్నిహితంగా కొనసాగారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో చేవేళ్ల పార్లమెంట్ నుంచి బరిలో దిగి విజయం సాధించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎదురుగాలి రావడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టి నుంచి రంజిత్ రెడ్డినే పోటీ చేస్తారని అధిష్టానం ప్రకటించింది. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో రంజిత్ రెడ్డి పోటీ చేసేందుకు వెనక్కితగ్గారు. ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రంజిత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఇందుకు రంజిత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరిగింది. రేపు సోమవారం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే చాన్స్ ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. పార్టిలో చేరితే చేవేళ్ల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని పార్టి వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టి తరుపున చేవేళ్ల నుంచి వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ సునితామహేందర్ రెడ్డి పోటీ చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్‌లో రంజిత్ రెడ్డి చేరితే సునితారెడ్డికి మరో స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తారని పార్టీ నేతలు అనుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరి స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా నేతలు పేర్కొంటున్నారు. లోకల్ యాడ్... ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/24426/