మహిళలకు సర్కారు కానుక
October 11, 2021
dharshininews
మహిళలకు సర్కారు కానుక
- బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన బొబ్బిలి శోభారాణి
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రతి ఆడపడుచుకుని పుట్టింటి కానుకలా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని తాండూరు మున్సిపల్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభారాణి అన్నారు. సోమవారం పాత తాండూరులోని తన వార్డు మహిళలకు, ఆడపడుచులకు ప్రభుత్వం ద్వారా అందించిన బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కళ్యాణలక్ష్మీ, షాధీముభారక్, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, ఒంటరి మహిళలకు పించన్ పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రతి యేడాది బతుకమ్మ పండగ సందర్భంగా మహిళల్లో సంతోషం నింపేందుకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందన్నారు. బతుకమ్మ చీరలు ధరించి మహిళలు బతుకమ్మ, దసరా, నవరాత్రి పండగలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్పీలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.