schedule Saturday, September 05, 2026

పేరు అతనిదే.. ర్యాంకు కాదు..!

calendar_today April 26, 2024
person dharshininews
పేరు అతనిదే.. ర్యాంకు కాదు..!
పేరు అతనిదే.. ర్యాంకు కాదు..! - సివిల్స్ ఫలితాల్లో పొరపాటు - జిల్లా యువకుడి పేరు హల్ చల్ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఒకే పేరు కావడంతో ర్యాంకు కూడా అతనిదే అనుకున్నారు అందరు. యువకుడిని అభినందిస్తూ సన్మానించారు. కాని నిజానికి అదే పేరు ఉన్న మరో అభ్యర్థిని ర్యాంకుగా ప్రకటించారు. సివిల్స్‌ ఫలితాల్లో ఏర్పడిన గందరగోళం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్‌ కుమార్‌ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. సమాచారం తెలుసుకున్న నాయకులు పెద్దఎత్తున గ్రామానికి చేరుకుని యువకుడితోపాటు అతడి తల్లిదండ్రులను సన్మానించారు. హాల్‌టికెట్‌ నంబరు ఆధారంగా తరుణ్‌ అనే పేరుతో హరియాణాకు చెందిన యువకుడికి 231 ర్యాంకు వచ్చింది. ఫలితాలు వచ్చిన సమయంలో ఇంటిపేరు లేకపోవడం, ఒకే తరహా పేరు ఉండడం, పరీక్షకు హాజరు కావడంతో హల్‌టికెట్‌ నంబరును సరిగ్గా గుర్తించక తనే ఎంపికైనట్లు తరుణ్‌ పొరపాటు పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు యువకుడు అందుబాటులో రాలేదు. గ్రామస్థులను అడిగితే ఆ ర్యాంకు సాధించింది హరియాణాకు చెందిన యువకుడని పేర్కొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25828/