schedule Sunday, July 05, 2026

బాలుడిపై వీధికుక్క దాడి

calendar_today May 8, 2024
person dharshininews
బాలుడిపై వీధికుక్క దాడి
బాలుడిపై వీధికుక్క దాడి - తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలు తాండూరు, దర్శిని ప్రతినిధి: బాలుడిపై వీధికుక్క దాడికి పాల్పడింది. గాయాలతో బాలుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ధన్‌గర్ గల్లికి చెందిన రాహుల్ అనే బాలుడు ఇంటి వద్ద ఉండగా అటుగా వచ్చిన వీధి కుక్క అకస్మాత్తుగా దాడికి పాల్పడింది. బాలుడు రెండు చేతులపై కరిచి గాయాలు చేసింది. ఈ క్రమంలో బాలుడి కుడి చేతి వేలు విరిగిపోయింది. గమనించిన స్థానికులు కుక్కను తరిమేసి బాలుడికి చికిత్స నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కల స్వైర విహారం భయబ్రాంతులకు గురిచేస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26290/