schedule Wednesday, November 11, 2026

అయ్యప్ప స్వాముల సేవలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు..!

calendar_today November 11, 2026
person dharshininews
అయ్యప్ప స్వాముల సేవలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు..!
అయ్యప్ప స్వాముల సేవలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు..! - మూడో రోజు పాదయాత్రలో దర్శించుకున్న యు. రమేష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం తాండూరు నుంచి సుమారు 60 మంది స్వాములు చేపట్టిన మహా పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. భక్తిశ్రద్ధల నడుమ కొనసాగుతున్న యాత్ర గాండ్లవీడు మండలానికి చేరుకున్న సందర్భంగా బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్‌ కుమార్ స్వాములను దర్శించుకుని వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పాదయాత్రలో పాల్గొని అయ్యప్ప స్వాములతో కొంతసేపు గడిపారు. అనంతరం మాట్లాడుతూ.. మండల దీక్షతో శబరిమల క్షేత్రానికి కాలినడకన బయలుదేరిన అయ్యప్ప స్వాముల రాకతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని అన్నారు. వికారాబాద్ జిల్లా సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరిపై అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. స్వాముల పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తికావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కృష్ణ మధురాజ్, తాండూరు ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేష్, పెద్దేముల్ మండల అధ్యక్షుడు జాన్ల వీరేష్, గిరిమోని శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శంకర్ నాయక్, గాండ్లవీడు మండల అధ్యక్షుడు విజయ్ కుమార్‌రెడ్డి, ఇతర నాయకులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45343/