schedule Tuesday, November 10, 2026

పెరుమాళ్ళకు.. జిల్లా పదవి..!

calendar_today November 10, 2026
person dharshininews
పెరుమాళ్ళకు.. జిల్లా పదవి..!
పెరుమాళ్ళకు.. జిల్లా పదవి..! - టీయూడబ్లూజే జిల్లా కోశాధికారిగా వెంకట్ రెడ్డి - అభినందనలతో ముంచెత్తిన యూనియన్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన సీనియర్ జర్నలిస్టు, విద్యావేత్త పెరుమాళ్ళ వెంకట్ రెడ్డికి జిల్లా స్థాయిలో పదవి దక్కింది. టీయూడబ్లూజే ఐజేయూ వికారాబాద్ జిల్లా కోశాధికారిగా నియామకం అయ్యారు. మంగళవారం వికారాబాద్ లోని సత్యభారతి ఫంక్షన్ హాల్ లో టీయూడబ్లూజే ఐజేయూ 3వ జిల్లా తృతీయ మహాసభలు జరిగాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, రాష్ట్ర ప్రతినిధుల సమక్షంలో జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది, జిల్లా అధ్యక్షులుగా కొత్తపల్లి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ లు ఎన్నిక కాగా జిల్లా కోశాధికారిగా తాండూరుకు చెందిన సీనియర్ జర్నలిస్టు పెరుమాళ్ళ వెంకట్ రెడ్డి నియామకం అయ్యారు. నాలుగు సంవత్సరాలు తాండూరు అధ్యక్షులుగా చక్కటి సేవలు అందించారు. జిల్లా కోశాధికారిగా నియామకం అయిన వెంకట్ రెడ్డిని టీయూడబ్లూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు, జర్నలిస్టులు శాలువతో సన్మానించి,, బొకే అందించి అభినందనలు తెలిపారు. https://www.dharshininews.com/45332/