తాండూరులో ఊపిరితిత్తుల ' పరీక్షల ' శిబిరం..!
November 9, 2026
dharshininews
తాండూరులో ఊపిరితిత్తుల ' పరీక్షల ' శిబిరం..!
- కన్సల్టెన్సీ, పీఎఫ్‌టీ సేవలు ఉచితం
- ఎల్లుండి ఆదిత్య ఆసుపత్రిలో ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే తాండూరు నియోజక వర్గ ప్రజలకు శుభవార్త. బాధితులకు ఉచిత పరీక్షల సేవలు అందించేందుకు తాండూరు పట్టణంలోని ఆదిత్య ఆసుపత్రి ముందుకొచ్చింది.
హైదరాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రి సహకారంతో తాండూరులోని ఆదిత్య ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ నెల 11న బుధవారం ఉచిత ఊపిరితిత్తుల ఆరోగ్య పరీక్షల శిబిరం జరగనుంది.
ఈ శిబిరంలో ప్రత్యేకత.. సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు వైద్యుల కన్సల్టేషన్, ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష (పీఎఫ్‌టీ) కూడా పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నారు.
సాధారణంగా కన్సల్టేషన్‌కు రూ.500, పీఎఫ్‌టీ పరీక్షకు రూ.1,200, మొత్తం రూ.1,700 ఖర్చు కాగా, శిబిరంలో ఈ సేవలన్నీ ఉచితంగా అందించనున్నారు. ఊపిరితిత్తుల వైద్య నిపుణుడు డాక్టర్ ఏ. రఘుకాంత్ (ఎంబీబీఎస్, ఎండీ పల్మనాలజీ), సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఈ శిబిరంలో వైద్య సేవలు అందించనున్నారు.
ఈ నెల 11న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం కొనసాగుతుంది. సాయిపూర్ రోడ్డులో కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు ఎదురుగా ఉన్న ఆదిత్య ఆసుపత్రిలో ఈ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారు సెల్ : 9493684848, 9391198408లకు సంప్రదించి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచించారు.
https://www.dharshininews.com/45313/