రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..!
November 9, 2026
dharshininews
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..!
- ప్రతి రైతు కుటుంబానికి అండగా సర్కారు
- తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
- హకీంపేట్ మెగా రైతు మేళాకు తరలిన రైతులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు.
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, వారి ఆర్థిక భరోసాకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గంలోని హకింపేట్‌లో నిర్వహిస్తున్న మెగా రైతు మేళా (భారీ రైతు బహిరంగ సభ)కు తాండూరు నియోజకవర్గం నుంచి బయలుదేరిన రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల బస్సులకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, పంటల కొనుగోలు వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు. రైతుల కష్టాలను గుర్తించి వారికి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు. హకింపేట్‌లో నిర్వహిస్తున్న మెగా రైతు మేళాకు తాండూరు నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివెళ్లడం సంతోషకరమని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అందరూ మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ వడ్డె శ్రీనివాస్, అధికారులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45321/