తాండూరు అభివృద్ధికి రూ.215 కోట్లు..!
November 10, 2026
dharshininews
తాండూరు అభివృద్ధికి రూ.215 కోట్లు..!
- రైతు మేళా వేదికగా రెండు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం
- సీఎంకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. కొడంగల్ నియోజకవర్గంలోని హాకీంపేట్‌లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన రైతు మేళా వేదికగా తాండూరుకు మొత్తం రూ.215 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చొరవతో ఈ నిధులు మంజూరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.
రూ.110 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు
కాగ్నా నది ద్వారా కొడంగల్–తాండూరు ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేసే పనులకు రూ.110 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.
రూ.105 కోట్లతో గ్రామీణాభివృద్ధి
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి పనుల కోసం రూ.105 కోట్లు కేటాయించారు. ఇందుకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఈ రెండు ప్రాజెక్టులతో తాండూరు నియోజకవర్గంలో తాగునీటి సరఫరా, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడనుందని స్థానిక ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) చైర్మన్లు, మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45325/