schedule Wednesday, November 11, 2026

ఊపిరితిత్తులకు.. ఊరట..!

calendar_today November 11, 2026
person dharshininews
ఊపిరితిత్తులకు.. ఊరట..!
ఊపిరితిత్తులకు.. ఊరట..! - ఉచిత పరీక్షల శిబిరానికి విశేష స్పందన - తాండూరులో 70 మందికి పైగా వైద్య సేవలు - వైద్యులను అభినందించిన ఆదిత్య ఆసుపత్రి అధినేత డా. శరత్‌చంద్ర తాండూరు, దర్శిని ప్రతినిధి: ఊపిరితిత్తుల ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు ఉచిత వైద్య సేవలు అందించేందుకు నిర్వహించిన ఊపిరితిత్తుల పరీక్షల శిబిరానికి విశేష స్పందన లభించింది. తాండూరు పట్టణంలోని సాయిపూర్‌ రోడ్డులో ఉన్న ఆదిత్య ఆసుపత్రిలో నిర్వహించిన ఈ శిబిరంలో 70 మందికి పైగా పాల్గొని వైద్య సేవలు పొందారు. హైదరాబాద్‌లోని మెడికవర్‌ ఆసుపత్రి సహకారంతో ఆదిత్య ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఊపిరితిత్తుల వైద్య నిపుణుడు డాక్టర్‌ ఏ. రఘుకాంత్‌ (ఎంబీబీఎస్‌, ఎండీ పల్మనాలజీ), సీనియర్‌ కన్సల్టెంట్‌, ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. కన్సల్టేషన్‌తో పాటు ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష (పీఎఫ్‌టీ)ను ఉచితంగా నిర్వహించారు. శిబిరానికి స్పందించి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలకు వైద్య సేవలు అందించిన వైద్య బృందాన్ని ఆదిత్య ఆసుపత్రి అధినేత డా. శరత్‌చంద్ర అభినందించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలాంటి ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. https://www.dharshininews.com/45345/