అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్..!
November 11, 2026
dharshininews
అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్..!
- తాండూరు నుంచి శబరిమలకు ప్రత్యేక సర్వీసు
- బస్సు అద్దె ధరల్లో భారీ మార్పులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) తాండూరు డిపో ఊరటనిచ్చే ప్రకటన చేసింది.
మాలధారణ స్వాముల కోసం ప్రత్యేక బస్సులను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో సూపర్ లగ్జరీ బస్సుకు కిలోమీటరుకు రూ.65గా ఉన్న ఛార్జీని ఈ ఏడాది రూ.59కి తగ్గించింది.
తాండూరు డిపో ప్రకటించిన వివరాల ప్రకారం.. సూపర్ లగ్జరీ (నాన్ ఏసీ) 36 సీట్ల బస్సుకు కిలోమీటరుకు రూ.59, 55 సీట్ల ఎక్స్‌ప్రెస్ బస్సుకు రూ.65, 40 సీట్ల డీలక్స్ బస్సుకు రూ.57 చొప్పున ఛార్జీలు నిర్ణయించారు. అన్ని రకాల బస్సులకు గంటకు వెయిటింగ్ ఛార్జీ రూ.300గా ఉంటుంది. గంటకు 30 కిలోమీటర్ల ప్రయాణాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. టోల్‌గేట్ రుసుము కూడా ప్రకటించిన ధరల్లోనే కలిపి ఉన్నట్లు పేర్కొన్నారు.
బస్సు బుక్ చేసుకునే గురుస్వామికి ప్రయాణ ఛార్జీ మినహాయింపు ఉంటుందని, ఒకటి కంటే ఎక్కువ బస్సులు బుక్ చేసిన వారికి రెండో బస్సు నుంచి రోజుకు రూ.300 చొప్పున కమిషన్ అందిస్తామని తెలిపారు. ప్రతి బస్సులో లగేజీ కోసం రెండు సీట్లు కేటాయిస్తారు. కేరళలో బార్డర్ ట్యాక్స్ మినహాయింపు ఉండగా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బార్డర్ ట్యాక్స్‌తో పాటు పార్కింగ్, పర్వత ప్రాంత ట్యాక్సులను బుక్ చేసుకున్నవారే చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతి బస్సుకు మార్గాలపై అనుభవం ఉన్న ఇద్దరు డ్రైవర్లను కేటాయించనున్నట్లు సంస్థ తెలిపింది. బస్సుల బుకింగ్, ఇతర వివరాల కోసం భక్తులు 8309348157, 9959226251, 9440069253 నంబర్లను సంప్రదించాలని తాండూరు డిపో మేనేజర్ సూచించారు.
https://www.dharshininews.com/45336/