schedule Saturday, September 05, 2026

మూర్చతో ముప్పు..!

calendar_today May 16, 2024
person dharshininews
మూర్చతో ముప్పు..!
మూర్చతో ముప్పు..! - గురక సమస్య ఉన్నవారికే ప్రమాదం - అసలు పరిశోధనలు ఏం చెబుతాయన్నంటే..? దర్శిని డెస్క్ : మూర్చ వ్యాధి అంటే అందరికి భయమే. ఈ మూర్చ వ్యాధితో పక్షవాతం, అధిక రక్తపోటు, మెదడులో కణితి వంటి రకరకాల రోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. నిజానికి చాలావరకూ చిన్న వయసులోనే మూర్చ మొదలవు తుంటుంది. కానీ ఇది జీవితంలో కొందరికి 60 ఏళ్ల తర్వాతా తొలిసారిగా వస్తుంటుంది. అందుకే దీన్ని ఆలస్యంగా మొదలయ్యే మూర్ఛగా భావిస్తుంటారు. మూర్ఛ రావటానికీ.. నిద్ర పోతున్నప్పుడు కాసేపు శ్వాస ఆడకపోవటం (స్లీప్‌ అప్నియా), రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గటానికీ సంబంధం ఉంటున్నట్టు తేలటమే దీనికి కారణమని ఓ అద్యయనంలో తేలినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గురక ఎందుకు వస్తుందంటే..? నిద్రలో కొందరికి గొంతు వెనకాల భాగం వదులై శ్వాస మార్గానికి అడ్డుతగులుతుంది. దీంతో శ్వాస ఆగుతుంది. అప్పుడు రక్తంలో ఆక్సిజన్‌ తగ్గటం వల్ల ఉక్కిరిబిక్కిరై బిగ్గరగా గురక పెడుతూ తిరిగి శ్వాస తీసుకుంటుంటారు. నిద్రమత్తులో ఉండటం వల్ల ఈ విషయం మనకు తెలియదు. కానీ రాత్రంతా చాలాసార్లు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇది రకరకాల సమస్యలకు దారితీస్తుంది. కొనసాగుతున్నపరిశోధనలు వృద్ధాప్యంలో మూర్ఛకూ కారణమవుతున్నట్టు ఇప్పుడు బయటపడింది. నిద్ర పోతున్నప్పుడు కాసేపు శ్వాస ఆగిపోయేవారికి రెండింతలు ముప్పు పెరుగుతున్నట్టు వెల్లడైంది. అదే రక్తంలో ఆక్సిజన్‌ 80% కన్నా తక్కువకు పడిపోయిన వారికైతే మూడింతలు ఎక్కువగా ముప్పు పొంచి ఉంటున్నట్టు తేలింది. దీర్ఘకాలంగా నిద్రలో ఆక్సిజన్‌ శాతం తగ్గుతూ వస్తుంటే మెదడులో మార్పులు తలెత్తే అవకాశముందని, ఇది మూర్ఛ ముప్పు పెరిగేలా చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. స్లీప్‌ అప్నియా చికిత్స లేదా నివారణతో మూర్ఛ వచ్చే అవకాశం తగ్గుతుందో లేదో అనేది అధ్యయనంలో నిర్ధరణ కాలేదు. కానీ మూర్ఛ ముప్పును తగ్గించుకోవటానికి దీన్ని ముఖ్యమైన అంశంగా పరిగణించొచ్చని సూచిస్తోంది. నిద్ర సమస్యలు, వృద్ధాప్యంలో వచ్చే మూర్ఛకు మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవటానికి ఈ అధ్యయన ఫలితాలు తోడ్పడ గలవని.. మెరుగైన చికిత్సల రూపకల్పనకు దారి తీయగలవని ఆశిస్తున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26485/