schedule Friday, September 04, 2026

టీఎస్ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

calendar_today May 18, 2024
person dharshininews
టీఎస్ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
టీఎస్ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల - రిలీజ్ చేసిన ఎడ్యూకేషన్ చీఫ్‌ సెక్రటరీ - ఈ వెబ్‌ సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోండి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల్లో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ప్రవేశ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలను శనివారం స్టేట్ ఎడ్యూకేషన్ చీఫ్‌ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు.   ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి.. * ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. * అనంతరం TS EAPCET 2024 Results ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. * తర్వాత మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి. * TS EAPCET 2024 ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26544/