schedule Tuesday, July 07, 2026

రేపు తాండూరులో పవర్ కట్

calendar_today May 18, 2024
person dharshininews
రేపు తాండూరులో పవర్ కట్
రేపు తాండూరులో పవర్ కట్ - ప్రకటించిన విద్యుత్ శాఖ అధికారులు - ఏయే ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో పవర్‌ కట్ విధిస్తున్నట్లు ఆ శాఖ డీఈ బాను ప్రసాద్ ప్రకటించారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని వెల్లడించారు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూర్ అన్ని ఫీడర్స్ పరిధి(అయ్యప్ప నగర్, గ్రీన్ సిటీ, కొడంగల్ రోడ్డు, మోమింగల్లి, గడితో పాటు పట్టణంలోని శివాజీ చౌక్, నెహ్రు గంజ్‌, పటేల్ భగీచా, చెన్‌గెష్‌పూర్ రోడ్, గాంధీనగర్‌, సీటీకేబుల్ ప్రాంతం)లో విద్యుత్ సరఫరా ఉండందన్నారు. అదేవిధంగా బషీరాబాద్ మండలం పరిధిలో ఉన్న అన్ని ఉపకేంద్రాల్లాలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. విద్యుత్ సరఫరా మరమ్మత్తులను దృష్టిలో ఉంచుకుని విధిస్తున్న అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26570/