schedule Saturday, September 12, 2026

ఆకలి తీర్చడం అభినందనీయం..!

calendar_today May 19, 2024
person dharshininews
ఆకలి తీర్చడం అభినందనీయం..!
ఆకలి తీర్చడం అభినందనీయం..! - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - అన్నదాన సేవను ప్రారంభించిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆకలితో ఉన్నవారికి కడుపు నింపడం అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు ఆర్య వైశ్య సంఘం, వాసవీ క్లబ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్)ల సహాకారంతో ఐవీఎఫ్ రాష్ట్ర యువజన కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవిలో అంబలి, మజ్జిగ పంపిణీ సేవతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఆకలితో ఉన్న వారు కడుపు నింపడం మహాద్భాగ్యమన్నారు. వైశ్య ఫెడరేషన్ ద్వారా చేస్తున్న ఉచిత సేవలకు తోడ్పాటు అందిస్తామన్నారు. చక్కని కార్యక్రమాన్ని చేపట్టిన రొంపల్లి సంతోష్ కుమార్ ను అభినందించారు. అనంతరం రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ సంఘాల సహాకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నెల రోజుల పాటు ప్రతి రోజూ మధ్యాహ్నం అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరణం పురుషోత్తంరావు, డాక్టర్ సంపత్ కుమార్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, కార్యదర్శి కోడూరి వినోద్ కుమార్, వైశ్య' ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26586/