schedule Sunday, July 05, 2026

రైతు, కూలీల మృతిపై ఎమ్మెల్యే దిగ్బ్రాంతి..!

calendar_today May 19, 2024
person dharshininews
రైతు, కూలీల మృతిపై ఎమ్మెల్యే దిగ్బ్రాంతి..!
రైతు, కూలీల మృతిపై ఎమ్మెల్యే దిగ్బ్రాంతి..! - భాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా - ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయంపై ప్రకటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రకృతి వైపరిత్యంలో ప్రాణాలు కోల్పోయిన రైతు, కూలీల మృతిపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఆదివారం నియోజకవర్గ పరిధి యాలాల మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షంలో పడిన పిడుగు వల్ల మండలంలోని బెన్నూర్ గ్రామానికి చెందిన వెంకప్ప(68), జుంటుపల్లి గ్రామానికి చెందిన మంగలి శ్రీనివాస్ (35), కోనింటి లక్ష్మప్ప (28) అనే రైతు కూలీలు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అందాల్సిన రూ. 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయంను అందజేసేలా కృషి చేస్తామన్నారు. ఈ విషయంపై వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆర్డీవో సూచించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ప్రకటించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26586/